Mahesh Planning Targets Pawan ....


మహేష్ బాబు తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ సంక్రాంతికి విడుదల అవుతన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయటానికి నిర్మాతలు చేస్తున్నారు. ఎంత భారీ ఎత్తున అంటే పవన్ పంజా ప్రింట్లను,షో లను దాటాలనే నిర్మాతలు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్ణయం అని తెలుస్తోంది. దూకుడుతో ఇండస్ట్రీ రికార్డులు బ్రద్దులు కొట్టిన మహేష్ ఈ చిత్రంతో మరోసారి ఓ రేంజి రికార్డులను నెలకొల్పి టాలీవుడ్ ని అంతర్జాతీయ స్ధాయిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందు నిమిత్తం ట్రేడ్ లో నిర్మాత ఓ డిఫెరెంట్ స్టాటజీతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 1900 నుంచి రెండు వేల దాకా స్క్రీన్స్ లో బిజినెస్ మ్యాన్ ఒకేసారి మొదటి రోజు ప్రదర్శించబడాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం డిస్ట్రిబ్యూటర్స్ తో,ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతున్నారు. ఎక్కడ విన్నా సంక్రాంతి వారం అంతా కేవలం బిజినెస్ మ్యాన్ గురించే వినపడాలని వారు కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఇక బిజినెస్ మ్యాన్ పాటలు విడుదల అయ్యాక చిత్రంపై క్రేజ్ ఓ రేంజిలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో కథ నడవనుంది. తెలుగు,తమిళ్,మళయాళ భాషల్లో జనవరి 11 న ఈచిత్రం విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దూకుడు ఆడియో మంచి విజయం సాధించటంతో అతన్నే ఈ సినిమాకు మహేష్ ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నిమిత్తం వదిలిన ఫస్ట్ లుక్ ట్రైలర్ అందరి ప్రశంసలూ పొందుతోంది. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో విడుదల అవనున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో విజేతగా నిలిచి దూకుడు రికార్డులను బ్రద్దలు కొడుతుందని మహేష్ ఫ్యాన్స్ సైతం ఆశలు పెట్టుకున్నారు. ఇక మహేష్ కి తెలుగు సహా తమిళ్‌లోనూ భారీ మార్కెట్‌ ఉంది. ముఖ్యంగా చెన్నైలో లో అతని వీరాభిమానులు ఉన్నారు. డిసెంబర్‌ 23న పాటలు మార్కెట్లోకి వస్తాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పాటల చిత్రీకరణ నిమిత్తం ధాయలాండ్,బ్యాంకాక్ లో మహేష్,పూరి బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై డావెంకట్‌ నిర్మిస్తున్నారు.
Share this post :

Post a Comment

Test Sidebar

 
Support : Creating Website | Wapdaily Template | Wapdaily Template
Copyright © 2011. wapdaily - All Rights Reserved
Template Created by Creating Website Published by Wapdaily Template
Proudly powered by Blogger
Animated Social Gadget - Blogger And Wordpress Tips