పవన్ కళ్యాణ్,మహేష్ బాబు మంచి ప్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా కాలంగా ఉంటోంది. కానీ ఏ నిర్మాతకూ వీరిద్దరనీ భరించి తమ సినిమాలో పెట్టుకునే ధైర్యం లేదు. అయితే అలాంటి విచిత్రమొకటి భవిష్యత్ లో జరిగే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మహేష్ బాబుతో త్వరలో మెహర్ రమేష్ గూఢచారి 116 చిత్రాన్ని రీమేక్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు.
ఆ చిత్రంలో శోభన్ బాబు గెస్ట్ రోల్ లో కనపడతారు. ఆ పాత్రను పవన్ చేత చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మెహర్ రమేష్ వెళ్లి పనవ్ ని రిక్వెస్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటివరకూ పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, ప్రాజెక్టు ప్రారంభమయ్యాక చూద్దామని దాటవేసినట్లు చెప్తున్నారు. అయితే అన్నీ కలిసి వచ్చి ప్రాజెక్టు ప్రారంభమయితే పవన్ చేసే అవకాశముందని చెప్తున్నారు. ఇక మహేష్ సైతం తాను ఇలాంటి మల్టిస్టారర్ చిత్రాల్లో చేయటానికి ఆసక్తి చూపెడుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజుతో కమిటైన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ తో పాటు వెంకటేష్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనపించనున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందే ఆ చిత్రం మల్టి స్టారర్ చిత్రాలకు నాంది అవుతుందని భావిస్తున్నారు.

Post a Comment