Businessman Movie Story(Telugu)

మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ పై చాలా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అభిమానులకు సైతం చాలా ఆసక్తిగా ఉంది. కథ ఏమై ఉంటుంది. ముంబై వెళ్లి మహేష్ ఏం చేస్తాడు..మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం మహేష్ గత చిత్రం పోకిరిలాగ ఉంటుందా అంటూ రకరకాల ఆలోచనలు,ఊహాగానాలు చేస్తున్నారు. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్క్లిల్స్ లో వినపడుతున్న కథనం ప్రకారం హీరో సూర్య ముంబై వచ్చి మాఫియానే వ్యాపారంగా ప్రారంభిస్తాడు. అది పాపులర్ అవుతూ కొత్త కొత్త శత్రువులను పరిచయం చేస్తూంటుంది. ఈ నేపధ్యంలో అతను ఎందుకొచ్చాడు అనేది తెలుస్తుంది. అది తను తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై పగ తీర్చుకోవాటనికి వచ్చాడు అని తెలుస్తుంది. అయితే ఇది కేవలం రూమర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పూరీ జగన్నాధ్ ఇంకా తల్లి తండ్రులను చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి వచ్చే హీరో కథలు చెసే అవకాశం లేదు.
ఈ చిత్రం కథ గతంలో సూర్య కోసం వర్మ వండించిన వంటకమేనని తెలుస్తోంది.ఈ కథ ఏమిటంటే..ఇందులో బిజినెస్‌మ్యాన్ చేసే బిజినెస్ ఏంటో తెలుసా.. నేరాలు! 2010 నాటికి భారతదేశంలో మాఫియా గ్యాంగుల కార్యకలాపాలు దాదాపు లేకుండాపోయాయి. దీనికి కారణం..దావూద్ ఇబ్రహీం ముఠా పాకిస్తాన్‌కి వెళ్లిపోవడం, చోటా షకీల్ పూర్తిగా నిస్తేజంగా మారడం, చోటా రాజన్ వివిధ ప్రభుత్వ సంస్థలకు సహకరిస్తుండటం, అరుణ్ గోవిల్ రాజకీయాల్లోకి రావడం, అబూ సలేమ్ జైలుపాలు కావడం. అండర్ ‌వరల్డ్ కార్యకలాపాలను అరికట్టడంలో విజయం సాధించిన ముంబై పోలీసులు తమ ఎన్‌ కౌంటర్ స్క్వాడ్ బృందాల్ని సైతం తొలగించేశాయి.
ఈ విషయాలనన్నింటినీ దక్షిణాదికి చెందిన ఒక వ్యాపారి జాగ్రత్తగా పరిశీలిస్తూ వచ్చాడు. దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యాపారుల మాదిరిగానే ముంబైకి వచ్చిన అతను వారిలాగా కాకుండా ‘నేరాల్ని’ వ్యాపారంగా ఎంచుకున్నాడు. సులువైన మార్గాల్లో ఎలా సంపాదించాలో తెలుసుకోవడంతో పాటు ముంబైని ఏలిన హాజీ మస్తాన్, వర్ధా భాయ్, కరీం లాలా, దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ వంటి మాఫియా లీడర్లు సాధించిన విజయాలను సునిశితంగా అధ్యయనం చేసిన అతను ముంబైలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌గా మారాలనుకుంటాడు. తప్పొప్పులపై, మంచి చెడులపై అతనికి నమ్మకాలు లేవు. ఒప్పందాలతోటే ఈ ప్రపంచంలోని అందరూ బతుకుతుంటారని అతను నమ్ముతాడు. ఆ ఒప్పందం భార్యాభర్తల మధ్య కావచ్చు; తల్లిదండ్రులు, పిల్లల మధ్య కావచ్చు; రాజకీయ నాయకులు, ఓటర్ల మధ్య కావచ్చు,బాబాలు, భక్తుల మధ్య కావచ్చు.
నేరం కూడా ఇతర వ్యాపారం లాంటిదేనని అతను భావిస్తాడు. అలాంటి గ్యాంగ్‌స్టర్ కథే ‘ద బిజినెస్‌మ్యాస్’. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘కంపెనీ’లోని గ్యాంగ్‌స్టర్ల మధ్య పోరాటాలు, పూరి రూపొందించిన ‘పోకిరి’లోని వినోదం..రెండూ ఈ సినిమాలో కనిపిస్తాయి. మహేష్‌బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, కో డైరెక్టర్: విజయ ప్రసాద్.
Share this post :

Post a Comment

Test Sidebar

 
Support : Creating Website | Wapdaily Template | Wapdaily Template
Copyright © 2011. wapdaily - All Rights Reserved
Template Created by Creating Website Published by Wapdaily Template
Proudly powered by Blogger
Animated Social Gadget - Blogger And Wordpress Tips