Who is the no 1 director???

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల్లో టాప్ ఎవరు? ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. మగధీర, దూకుడు, బిజినెస్ మేన్ లాంటి భారీ హిట్ల నేపథ్యంలో మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అని అభిమానులు గొడవ పడుతున్న నేపథ్యంలో.....ఈ హిట్ల వెనక ఉన్న దర్శకత్వ విభాగంలో టాప్ రేంజ్ ఎవరిది అనే కోణం తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం టాప్ 5 దర్శకుల పేర్లలో పూరి జగన్నాథ్, శీను వైట్ల, రాజమౌళి, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో రాజమౌళి అత్యధికంగా రూ. 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని, పూరి జగన్నాథ్ రూ. 5 కోట్లు, వివి వినాయక్ రూ. 5 కోట్లు, శ్రీనువైట్ల రూ. 4 కోట్లు+ఒక ఏరియా షేర్, త్రివిక్రమ్ రూ. 4కో్ట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

పూరి జగన్నాథ్ తన కెరీర్లో బద్రి, పోకిరి, దేశ ముదురు, ఇడియట్, బిజినెస్ మన్ లాంటి భారీ హిట్లతో పాటు ఎన్నో విజయవంతం అయిన చిత్రాలను తీసి టాప్ దర్శకుడిగా ఎదిగాడు. అయితే పూరి తీసిన సినిమాల్లో పలు ప్లాపు చిత్రాలు కూడా ఉన్నాయి.

ఓటమి అంటే ఏమిటో ఎరుగని దర్శకుడిగా రాజమౌళికి మంచి పేరుంది. ఆయన తొలి సినిమా స్టూడెంట్ నెం.1 దగ్గర నుంచి మర్యాద రామన్న వరుకు అన్నీ హిట్లే. తాజాగా ఈగ అనే విభిన్నమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నెం.1 స్థానికి పోటీ పడే దర్శకుల్లో అగ్రస్థానంలో ఉన్నది రాజమౌళే.

దూకుడు సినిమాతో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు శ్రీను వైట్లకి వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది. ఢీ, రెడీ, అందరి వాడు, దుబాయ్ శ్రీను చిత్రాలు శ్రీను వైట్లకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆది, ఠాగూర్, దిల్, కృష్ణ, అదుర్స్ చిత్రాలతో టాప్ 5 దర్శకుల్లో చోటు దక్కించుకున్నాడు వివి వినాయక్. ఇక త్రివిక్ర్ కు కెరీర్లో పెద్దగా హిట్లు లేక పోయినా ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు కథను నడిపిస్తాడనే మంచి పేరుతో టాప్ 5లో చివరి స్థానంలో ఉన్నాడు.

అయితే వీరిలో నెం.1 స్థానాన్ని రెమ్యూనరేషన్ పరంగా నిర్ణయించాలా? లేక సక్సెస్ సంఖ్య పరంగా నిర్ణయించాలా? అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ పెద్ద హీరోలతో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి ఫలితాల ఆధారంగా ఈ సంవత్సరం నెం.1 దర్శకుడు ఎవరో తేలుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Share this post :

+ comments + 1 comments

January 29, 2012 at 1:02 PM

Drive more traffic into your website by submitting your links @ http://www.aphits.com.

Exclusively for all india updates.

Hurry up.. Grab the vistors..

Post a Comment

Test Sidebar

 
Support : Creating Website | Wapdaily Template | Wapdaily Template
Copyright © 2011. wapdaily - All Rights Reserved
Template Created by Creating Website Published by Wapdaily Template
Proudly powered by Blogger
Animated Social Gadget - Blogger And Wordpress Tips